Hyderabad Rains. Rain has started in Hyderabad. The Meteorological Department has warned that this rain is likely to continue till tomorrow. In this context, GHMC and Hydra have been alerted. On the other hand, heavy rain has caused traffic jams in many places in the city. Water has reached the roads. The Meteorological Department has issued an orange alert for Hyderabad for two days.
హైదరాబాద్ లో వర్షం మొదలైంది. ఈ వర్షం రేపటి వరకు కూడా ఉండే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ నేపథ్యంలో జీహెచ్ఎంసీ, హైడ్రా అప్రమత్తమైంది. మరోవైపు భారీ వర్షంతో సిటీలో పలు చోట్ల ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. రోడ్ల పైకి నీరు చేరింది. వాతావరణ శాఖ హైదరాబాద్ కు రెండు రోజులు పాటు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. బుధ, గురువారం హైదరాబాద్ అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. చాలా చోట్ల 7 సెంటి మీటర్ల నుంచి 12 సెంటి మీటర్ల వర్షపాతం నమోదు అయ్యే అవకాశం ఉందని పేర్కొంది. అందుకే హైదరాబాద్ పరిధిలోని పాఠశాలలకు ఒంటి పూట సెలవు ప్రకటించారు. భారీ వర్షాల నేపథ్యంలో హైడ్రా అప్రమత్తమైంది.
#hydrabadrain
#hyderabadrainalert
#hyderabadweather